కురాన్ - 33:35 సూరా సూరా అహ్‌జాబ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّ ٱلۡمُسۡلِمِينَ وَٱلۡمُسۡلِمَٰتِ وَٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ وَٱلۡقَٰنِتِينَ وَٱلۡقَٰنِتَٰتِ وَٱلصَّـٰدِقِينَ وَٱلصَّـٰدِقَٰتِ وَٱلصَّـٰبِرِينَ وَٱلصَّـٰبِرَٰتِ وَٱلۡخَٰشِعِينَ وَٱلۡخَٰشِعَٰتِ وَٱلۡمُتَصَدِّقِينَ وَٱلۡمُتَصَدِّقَٰتِ وَٱلصَّـٰٓئِمِينَ وَٱلصَّـٰٓئِمَٰتِ وَٱلۡحَٰفِظِينَ فُرُوجَهُمۡ وَٱلۡحَٰفِظَٰتِ وَٱلذَّـٰكِرِينَ ٱللَّهَ كَثِيرٗا وَٱلذَّـٰكِرَٰتِ أَعَدَّ ٱللَّهُ لَهُم مَّغۡفِرَةٗ وَأَجۡرًا عَظِيمٗا

నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము'మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము'మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు[1] ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్గాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు;[2] మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు.

సూరా సూరా అహ్‌జాబ్ ఆయత 35 తఫ్సీర్


[1] 'సౌమున్: కేవలం ఆహార పానీయాలే గాక ఇతర చెడు విషయాల నుండి కూడా దూరంగా ఉండటం. ఇంకా చూడండి, 19:26 అక్కడ ఈ శబ్దం మాట్లాడకుండా ఉండటాన్ని సూచిస్తుంది. [2] చూడండి, 24:30.

సూరా అహ్‌జాబ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter