కురాన్ - 33:57 సూరా సూరా అహ్‌జాబ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّ ٱلَّذِينَ يُؤۡذُونَ ٱللَّهَ وَرَسُولَهُۥ لَعَنَهُمُ ٱللَّهُ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِ وَأَعَدَّ لَهُمۡ عَذَابٗا مُّهِينٗا

నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి బాధ కలిగిస్తారో, వారిని అల్లాహ్ ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా శపిస్తాడు (బహిష్కరిస్తాడు) మరియు ఆయన వారికై అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.[1]

సూరా సూరా అహ్‌జాబ్ ఆయత 57 తఫ్సీర్


[1] అల్లాహ్ (సు.తా.) ను ఎవ్వరూ బాధించలేరు. ఇక్కడ దీని అర్థం అల్లాహ్ (సు.తా.) కు ఇష్టం లేని పని చేయడం. ఉదా: అల్లాహ్ (సు.తా.)కు సంతానం అంటగట్టడం. అల్లాహ్ (సు.తా.) యొక్క సందేశహరునికి బాధ కలిగించడం అంటే, అతని ('స'అస) పై అసత్యవాదుడు, కవి, మాంత్రికుడు అని అపనిందలు మోపడం. ల'అనతున్: అంటే అల్లాహ్ (సు.తా.) అనుగ్రహాల నుండి బహిష్కరించ, శపించ, నిషేధించ, త్రోసివేయ, దూషించ బడటం అనే అర్థాలున్నాయి. చూడండి, 2:88.

సూరా అహ్‌జాబ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter