మరియు ఈ విధంగా మేము మానవుల నుండి మరియు జిన్నాతుల నుండి, షైతానులను ప్రతి ప్రవక్తకు శత్రువులుగా చేశాము. వారు ఒకరినొకరు మోసపుచ్చు కోవటానికి ఇంపైన మాటలు చెప్పుకుంటారు. మరియు నీ ప్రభువు తలచుకుంటే వారిలా చేసేవారు కాదు. కావును వారిని వారి కల్పనలలో వదిలి పెట్టు[1].
సూరా సూరా అనాం ఆయత 112 తఫ్సీర్
[1] 'తబరీ (ర'హ్మ) వ్రాశారు ఎన్నో 'స'హీ'హ్ 'హదీస్'లు ఉన్నాయని. కొందరు దైవప్రవక్త ('స'అస) ను అడిగారు: "ఏమీ? మానవులలో కూడా షైతును ఉన్నారా?" అతను జవాబిచ్చారు: "అవును మరియు వారు జిన్నాతులలోని షైతానుల కంటే ఎక్కువ దుష్టులు." ఇంకా చూడండి, 25:30-31.
సూరా సూరా అనాం ఆయత 112 తఫ్సీర్