Quran Quote  :  They do not outstrip Him in speech and only act as He commands. - 21:27

కురాన్ - 6:116 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِن تُطِعۡ أَكۡثَرَ مَن فِي ٱلۡأَرۡضِ يُضِلُّوكَ عَن سَبِيلِ ٱللَّهِۚ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنۡ هُمۡ إِلَّا يَخۡرُصُونَ

మరియు భూమిలోని అధిక సంఖ్యాకులను నీవు అనుసరిస్తే వారు నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తారు. వారు కేవలం ఊహలనే అనుసరిస్తున్నారు మరియు వారు కేవలం ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు[1].

సూరా సూరా అనాం ఆయత 116 తఫ్సీర్


[1] అధిక సంఖ్యాకులు అనుసరించే మార్గం సరైన మార్గం కాకపోవచ్చు! దీనికి ఈ 'హదీస్' ఒక నిదర్శనం. దైవప్రవక్త ప్రవచనం : "నా అనుచరులు 73 శాఖలలో విభజింపబడతారు. వారిలో కేవలం ఒక శాఖ వారు మాత్రమే స్వర్గానికి పోతారు. మిగిలిన వారంతా నరకానికి పోతారు. స్వర్గానికి పోయేవారి గుర్తు ఏమిటంటే వారు నేనూ మరియు నా అనుచరులు అనుసరించిన మార్గాన్నే అనుసరిస్తారు. " (సునన్ అబూ-దావూద్, 'హదీస్' నం. 4596. తిర్మిజీ').

Sign up for Newsletter