వారిని అడుగు: "ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఎవరికి చెందినది?" అని. (నీవే) జవాబివ్వు: "(అంతా) అల్లాహ్ దే!" ఆయన కరుణించటాన్ని, తనపై తాను (కర్తవ్యంగా) విధించుకున్నాడు[1]. నిశ్చయంగా, ఆయన పునరుత్థాన దినమున మీ అందరినీ సమావేశ పరుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరైతే తమను తాము నష్టానికి గురి చేసుకున్నారో, అలాంటి వారే విశ్వసించరు!
సూరా సూరా అనాం ఆయత 12 తఫ్సీర్
[1] దైవప్రవక్త ('స'అస) ప్రచనం: "అల్లాహ్ (సు.తా.) సందేశం: 'నిశ్చయంగా, నా కారుణ్యం నా ఆగ్రహానికంటే మించింది.' " 'స. బు'ఖారీ మరియు 'స. ముస్లిం). చూడండి, 6:64, 7:156.
సూరా సూరా అనాం ఆయత 12 తఫ్సీర్