కురాన్ - 6:124 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِذَا جَآءَتۡهُمۡ ءَايَةٞ قَالُواْ لَن نُّؤۡمِنَ حَتَّىٰ نُؤۡتَىٰ مِثۡلَ مَآ أُوتِيَ رُسُلُ ٱللَّهِۘ ٱللَّهُ أَعۡلَمُ حَيۡثُ يَجۡعَلُ رِسَالَتَهُۥۗ سَيُصِيبُ ٱلَّذِينَ أَجۡرَمُواْ صَغَارٌ عِندَ ٱللَّهِ وَعَذَابٞ شَدِيدُۢ بِمَا كَانُواْ يَمۡكُرُونَ

మరియు వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు వారు: "అల్లాహ్ యొక్క సందేశహరులకు ఇవ్వబడినట్లు, మాకు కూడా (దివ్యజ్ఞానం)[1] ఇవ్వబడనంత వరకు మేము విశ్వసించము." అని అంటారు. తన సందేశాన్ని ఎవరిపై అవతరింపజేయాలో అల్లాహ్ కు బాగా తెలుసు. త్వరలోనే అపరాధులు అల్లాహ్ దగ్గర అవమానింపబడగలరు. మరియు వారి కుట్రల ఫలితంగా వారికి తీవ్రమైన శిక్ష విధించబడగలదు.

సూరా సూరా అనాం ఆయత 124 తఫ్సీర్


[1] అంటే ప్రవక్తృత్వం మరియు దివ్యజ్ఞానం (వ'హీ) అవతరింపజేయబడటం.

Sign up for Newsletter