కురాన్ - 6:141 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞وَهُوَ ٱلَّذِيٓ أَنشَأَ جَنَّـٰتٖ مَّعۡرُوشَٰتٖ وَغَيۡرَ مَعۡرُوشَٰتٖ وَٱلنَّخۡلَ وَٱلزَّرۡعَ مُخۡتَلِفًا أُكُلُهُۥ وَٱلزَّيۡتُونَ وَٱلرُّمَّانَ مُتَشَٰبِهٗا وَغَيۡرَ مُتَشَٰبِهٖۚ كُلُواْ مِن ثَمَرِهِۦٓ إِذَآ أَثۡمَرَ وَءَاتُواْ حَقَّهُۥ يَوۡمَ حَصَادِهِۦۖ وَلَا تُسۡرِفُوٓاْۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلۡمُسۡرِفِينَ

మరియు ఆయనే పందిళ్ళ మీద ప్రాకే (ఎక్కించబడే) తీగలు మరియు పందిళ్ళ మీద ప్రాకని (ఎక్కించబడని) చెట్ల తోటలు మరియు ఖర్జూరపు చెట్లు మరియు వివిధ రకాల రుచి గల పంటలు మరియు జైతూన్ (ఆలివ్), దానిమ్మ చెట్లను పుట్టించాడు. అవి కొన్ని విషయాలలో ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి. మరికొన్ని విషయాలలో ఒకదానితో ఒకటి పోలి ఉండవు[1]. వాటికి ఫలాలు వచ్చినపుడు వాటి ఫలాలను తినండి. కానీ వాటి కోత దినమున (ఫలకాలంలో) వాటి హక్కు (జకాత్) చెల్లించండి[2]. మరియు వృథాగా ఖర్చు చేయకండి. నిశ్చయంగా, ఆయన వృథా ఖర్చు చేసే వారంటే ఇష్టపడడు.

సూరా సూరా అనాం ఆయత 141 తఫ్సీర్


[1] చూడండి, 6:99 వ్యాఖ్యానం 2. [2] ఈ 'జకాత్ కొందరు ధర్మవేత్తల ప్రకారం 1/10. ఒకవేళ నీటిని కుంటల నుండి లేక నదుల నుండి తీసుకుంటే! కాని ఒకవేళ బావి నీరు, బోర్ వెల్ నీరు తీసుకుంటే 1/20 వంతు.

Sign up for Newsletter