Quran Quote  :  Noah son was also dawned into water as he refused to embark on the Ark. - 11:43

కురాన్ - 6:143 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ثَمَٰنِيَةَ أَزۡوَٰجٖۖ مِّنَ ٱلضَّأۡنِ ٱثۡنَيۡنِ وَمِنَ ٱلۡمَعۡزِ ٱثۡنَيۡنِۗ قُلۡ ءَآلذَّكَرَيۡنِ حَرَّمَ أَمِ ٱلۡأُنثَيَيۡنِ أَمَّا ٱشۡتَمَلَتۡ عَلَيۡهِ أَرۡحَامُ ٱلۡأُنثَيَيۡنِۖ نَبِّـُٔونِي بِعِلۡمٍ إِن كُنتُمۡ صَٰدِقِينَ

(పెంటి-పోతు కలిసి) ఎనిమిది రకాలు (జతలు)[1]. అందులో గొర్రెలలో నుండి రెండు (పెంటి - పోతు) మరియు మేకలలో నుండి రెండు (పెంటి - పోతు). వారిని అడుగు: "ఏమీ? ఆయన నిషేధించింది, రెండు మగవాటినా ? లేక రెండు ఆడవాటినా? లేక ఆ రెండు ఆడవాటి గర్భాలలో ఉన్న వాటినా?[2] మీరు సత్యవంతులే అయితే, నాకు సరైన జ్ఞానంతో తెలుపండి."

సూరా సూరా అనాం ఆయత 143 తఫ్సీర్


[1] అరబ్బీ భాషలో ఒకే రమైన ఆడ-మగలను కలిపి జత ('జౌజ్), అంటారు. ఆ రెండింటిలోని, ప్రతి ఒక్క దానిని కూడా 'జౌజ్, అని అంటారు. అంటే జతలో నుండి ఒకటి. ఎందుకంటే, ఒకటి మరొకదాని జతకారి. ఇక్కడ ఆ జతలో ప్రతి ఒక్కటి అనే అర్థంలో ఉపయోగించబడింది. [2] ముష్రికులు కొన్ని పశువులను తమంతట తామే నిషిద్ధం ('హరాం) చేసుకొని ఉండిరి. కావున ఇక్కడ వారితో ఈ ప్రశ్న అడుగబడుతోంది. ఎందుకంటే, అల్లాహ్ (సు.తా.) వీటిలో దేనిని కూడా 'హరామ్ చేయలేదు.

Sign up for Newsletter