కురాన్ - 6:146 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَعَلَى ٱلَّذِينَ هَادُواْ حَرَّمۡنَا كُلَّ ذِي ظُفُرٖۖ وَمِنَ ٱلۡبَقَرِ وَٱلۡغَنَمِ حَرَّمۡنَا عَلَيۡهِمۡ شُحُومَهُمَآ إِلَّا مَا حَمَلَتۡ ظُهُورُهُمَآ أَوِ ٱلۡحَوَايَآ أَوۡ مَا ٱخۡتَلَطَ بِعَظۡمٖۚ ذَٰلِكَ جَزَيۡنَٰهُم بِبَغۡيِهِمۡۖ وَإِنَّا لَصَٰدِقُونَ

"మరియు యూదమతం అవలంబించిన వారికి మేము గోళ్ళు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము[1]. మరియు వారికి ఆవు మరియు మేకలలో, వాటి వీపులకు లేదా ప్రేగులకు తగిలివున్న మరియు ఎముకలలో మిశ్రమమై ఉన్న క్రొవ్వు తప్ప, మిగతా (క్రొవ్వును) నిషేధించాము. ఇది వారి అక్రమాలకు విధించిన శిక్ష. మరియు నిశ్చయంగా, మేము సత్యవంతులము!"

సూరా సూరా అనాం ఆయత 146 తఫ్సీర్


[1] గోళ్ళు ఉన్న జంతువులు అంటే, వాటి వ్రేళ్ళు విడివడిగా లేని జంతువులు ఉదా. ఒంటెలు, బాతులు, నిప్పుకోడి (ఉష్ట్రపక్షి), ఆవులు మరియు మేకలు మొదలైనవి, యూదుల కొరకు 'హరామ్ చేయబడ్డాయి. కేవలం వ్రేళ్ళు విడిగా ఉన్న పశుపక్షులు మాత్రమే వారికి 'హలాల్ చేయబడ్డాయి.

Sign up for Newsletter