ఇలా అను: "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి ఇతరులను ప్రభువులుగా అర్థించాలా? ఆయనే ప్రతి దానికీ ప్రభువు! ప్రతి వ్యక్తీ తాను సంపాదించిందే అనుభవిస్తాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు[1]. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలి పోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ విషయాలను గురించి భేదాభిప్రాయాలు కలిగి ఉండేవారో, వాటిని మీకు తెలియజేస్తాడు."
సూరా సూరా అనాం ఆయత 164 తఫ్సీర్
[1] అల్లాహ్ (సు.తా.) ప్రతి ఒక్కనికి అతని కర్మలకు తగిన ప్రతిఫలమిస్తాడు. మంచి చేసిన వానికి మంచి ఫలితం మరియు చెడు చేసిన వానికి తగిన శిక్ష. అల్లాహుతా'ఆలా ఒకని పాపభారాన్ని మరొకనిపై మోపడు. ఏ వ్యక్తి కూడా ఇతరుల పాపభారాన్ని మోయడు. ఏ వ్యక్తిపై కూడా - అతడు ప్రవక్త అయినా సరే - ఇతరుల పాపభారం మోపబడదని అల్లాహ్ (సు.తా.) ఈ ఆయత్ లో స్పష్టంగా తెలుపుతున్నాడు. అంటే మానవుల పాప భారాలను మోయటానికి 'ఈసా ('అ.స.) సిలువపై ఎక్కారనే క్రైస్తవుల అపోహను ఈ ఆయత్ ఖండిస్తోంది.
సూరా సూరా అనాం ఆయత 164 తఫ్సీర్