కురాన్ - 6:59 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞وَعِندَهُۥ مَفَاتِحُ ٱلۡغَيۡبِ لَا يَعۡلَمُهَآ إِلَّا هُوَۚ وَيَعۡلَمُ مَا فِي ٱلۡبَرِّ وَٱلۡبَحۡرِۚ وَمَا تَسۡقُطُ مِن وَرَقَةٍ إِلَّا يَعۡلَمُهَا وَلَا حَبَّةٖ فِي ظُلُمَٰتِ ٱلۡأَرۡضِ وَلَا رَطۡبٖ وَلَا يَابِسٍ إِلَّا فِي كِتَٰبٖ مُّبِينٖ

మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.[1]

సూరా సూరా అనాం ఆయత 59 తఫ్సీర్


[1] అగోచర విషయాల తాళపు చెవులు ఐదు ఉన్నాయి. 1) పునరుత్థాన దినపు జ్ఞానం, 2) వర్షం వచ్చే సమయం, 3) తల్లి గర్భాశయంలో ఉన్న బిడ్డ విషయం, 4) రేపు సంభవించే విషయం, 5) మరణం సంభవించే చోటు. ('స'హీ'హ్ బు'ఖారీ, తఫ్సీర్ సూరహ్ అల్-అన్'ఆమ్).

Sign up for Newsletter