కురాన్ - 6:60 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَهُوَ ٱلَّذِي يَتَوَفَّىٰكُم بِٱلَّيۡلِ وَيَعۡلَمُ مَا جَرَحۡتُم بِٱلنَّهَارِ ثُمَّ يَبۡعَثُكُمۡ فِيهِ لِيُقۡضَىٰٓ أَجَلٞ مُّسَمّٗىۖ ثُمَّ إِلَيۡهِ مَرۡجِعُكُمۡ ثُمَّ يُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ

మరియు ఆయనే రాత్రివేళ (మీరు నిద్రపోయినపుడు) మీ ఆత్మలను తీసుకుంటాడు (స్వాధీనపరచు కుంటాడు)[1] మరియు పగటివేళ మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఆ పిదప నిర్ణీత గడువు, పూర్తి అయ్యే వరకు దానిలో (పగటి వేళలో) మిమ్మల్ని తిరిగి లేపుతాడు. ఆ తరువాత ఆయన వైపునకే మీ మరలింపు ఉంది. అప్పుడు (పునరుత్థాన దినమున) ఆయన మీరు చేస్తూ ఉన్న కర్మలన్నీ మీకు తెలుపుతాడు[2].

సూరా సూరా అనాం ఆయత 60 తఫ్సీర్


[1] చూడండి, 39:42. చావును గురించి అవతరింపజేయబడిన మొదటి ఆయత్. [2] చూడండి, 78:9-11.

Sign up for Newsletter