ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం)[1] గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకొని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినపుడు, మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రద్ధ చూపరు[2].
సూరా సూరా అనాం ఆయత 61 తఫ్సీర్
[1] చూడండి అల్ ఖాహిరు, 6:18. [2] చూడండి, 32:11లో ఒక మరణదైవదూత పేర్కొనబడ్డాడు. కానీ, ఈ ఆయత్ లో దైవదూతలు, అని ఉంది. ఇదే విధంగా 4:97 మరియు 6:93లలో కూడా దైవదూతలు, అని ఉంది. దీన వల్ల స్పష్టమయ్యేదేమిటంటే మరణింపజేసే దైవదూత ఒక్కడే, కాని ఇతరులు అతని సహాయకులు. ఆ మరణింపజేసే దైవదూత పేరు 'ఇ'జ్రాయీ'ల్. (ఇబ్నె-కసీ'ర్).
సూరా సూరా అనాం ఆయత 61 తఫ్సీర్