కురాన్ - 6:71 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قُلۡ أَنَدۡعُواْ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَنفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلَىٰٓ أَعۡقَابِنَا بَعۡدَ إِذۡ هَدَىٰنَا ٱللَّهُ كَٱلَّذِي ٱسۡتَهۡوَتۡهُ ٱلشَّيَٰطِينُ فِي ٱلۡأَرۡضِ حَيۡرَانَ لَهُۥٓ أَصۡحَٰبٞ يَدۡعُونَهُۥٓ إِلَى ٱلۡهُدَى ٱئۡتِنَاۗ قُلۡ إِنَّ هُدَى ٱللَّهِ هُوَ ٱلۡهُدَىٰۖ وَأُمِرۡنَا لِنُسۡلِمَ لِرَبِّ ٱلۡعَٰلَمِينَ

(ఓ ముహమ్మద్!) వారితో అను: "ఏమీ? అల్లాహ్ ను వదలి మాకు లాభం గానీ, నష్టం గానీ కలిగించ లేని వారిని మేము ప్రార్థించాలా? మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం దొరికిన తరువాత కూడా మా మడమలపై వెనుదిరిగి పోవాలా? అతని వలే ఎవడైతే తన సహచరులు సన్మార్గం వైపుకు పిలుస్తూ, 'మా వైపుకురా!' అంటున్నా - షైతాన్ మోసపుచ్చటం వలన - భూమిలో ఏమీ తోచకుండా, తిరుగుతాడో?"[1] వారితో అను: "నిశ్చయంగా, అల్లాహ్ మార్గదర్శకత్వమే నిజమైన మార్గదర్శకత్వము[2]. మరియు మేము సర్వలోకాల ప్రభువుకు విధేయులముగా (ముస్లింలముగా) ఉండాలని ఆజ్ఞాపించబడ్డాము;

సూరా సూరా అనాం ఆయత 71 తఫ్సీర్


[1] చూడండి, 2:14, 14:22 మరియు 15:17. [2] చూడండి, 16:37.

Sign up for Newsletter