మరియు మేము అతనికి (ఇబ్రాహీమ్ కు) ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించాము[1]. ప్రతి ఒక్కరికీ సన్మార్గం చూపాము. అంతకు పూర్వం నూహ్ కు సన్మార్గం చూపాము. మరియు అతని సంతతిలోని వారైన దావూద్, సులైమాన్, అయ్యాబ్, యూసుఫ్, మూసా మరియు హారూన్ లకు మేము (సన్మార్గం చూపాము). మరియు ఈ విధంగా మేము సజ్జనులకు తగిన ప్రతిఫలమిస్తాము.
సూరా సూరా అనాం ఆయత 84 తఫ్సీర్