కురాన్ - 6:93 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوۡ قَالَ أُوحِيَ إِلَيَّ وَلَمۡ يُوحَ إِلَيۡهِ شَيۡءٞ وَمَن قَالَ سَأُنزِلُ مِثۡلَ مَآ أَنزَلَ ٱللَّهُۗ وَلَوۡ تَرَىٰٓ إِذِ ٱلظَّـٰلِمُونَ فِي غَمَرَٰتِ ٱلۡمَوۡتِ وَٱلۡمَلَـٰٓئِكَةُ بَاسِطُوٓاْ أَيۡدِيهِمۡ أَخۡرِجُوٓاْ أَنفُسَكُمُۖ ٱلۡيَوۡمَ تُجۡزَوۡنَ عَذَابَ ٱلۡهُونِ بِمَا كُنتُمۡ تَقُولُونَ عَلَى ٱللَّهِ غَيۡرَ ٱلۡحَقِّ وَكُنتُمۡ عَنۡ ءَايَٰتِهِۦ تَسۡتَكۡبِرُونَ

మరియు అల్లాహ్ పై అబద్ధపు నింద మోపే వాని కంటే, లేదా తనపై ఏ దివ్య జ్ఞానం (వహీ) అవతరించక పోయినప్పటికీ: "నాపై దివ్యజ్ఞానం అవతరింప జేయబడుతుంది." అని చేప్పేవాని కంటే, లేదా: "అల్లాహ్ అవతరింప జేసినటువంటి విషయాలను నేను కూడా అవతరింపజేయగలను." అని పలికే వాని కంటే, మించిన దుర్మార్గుడు ఎవడు? దుర్మార్గులు మరణ వేదనలో ఉన్నప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి: "మీ ప్రాణాలను వదలండి! అల్లాహ్ పై అసత్యాలు పలుకుతూ ఉన్నందు వలన మరియు ఆయన సూచనల పట్ల అనాదరణ చూపటం వలన, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది!"[1] అని అంటూ ఉండే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది![2]

సూరా సూరా అనాం ఆయత 93 తఫ్సీర్


[1] ఇక్కడ పేర్కొన్న శిక్ష చనిపోయిన తరువాత మరియు పునరుత్థాన దినానికి ముందు ఉండే బ'ర్జఖ్ కాలంలో ఇవ్వబడే శిక్ష. [2] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 2, 'హదీస్' నం. 450 మరియు 422.

Sign up for Newsletter