కురాన్ - 6:99 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَهُوَ ٱلَّذِيٓ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجۡنَا بِهِۦ نَبَاتَ كُلِّ شَيۡءٖ فَأَخۡرَجۡنَا مِنۡهُ خَضِرٗا نُّخۡرِجُ مِنۡهُ حَبّٗا مُّتَرَاكِبٗا وَمِنَ ٱلنَّخۡلِ مِن طَلۡعِهَا قِنۡوَانٞ دَانِيَةٞ وَجَنَّـٰتٖ مِّنۡ أَعۡنَابٖ وَٱلزَّيۡتُونَ وَٱلرُّمَّانَ مُشۡتَبِهٗا وَغَيۡرَ مُتَشَٰبِهٍۗ ٱنظُرُوٓاْ إِلَىٰ ثَمَرِهِۦٓ إِذَآ أَثۡمَرَ وَيَنۡعِهِۦٓۚ إِنَّ فِي ذَٰلِكُمۡ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ

మరియు ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు తరువాత దాని ద్వారా మేము సర్వలోకాల వృక్షకోటిని ఉద్భవింపజేశాము[1]. మరియు దాని నుండి మేము పచ్చని పైరును పండించాము. వాటిలో దట్టమైన గింజలను పుట్టించాము. మరియు ఖర్జూరపు చెట్ల గెలల నుండి క్రిందికి వ్రేలాడుతున్న పండ్ల గుత్తులను, ద్రాక్ష, జైతూన్ మరియు దానిమ్మ తోటలను (పుట్టించాము). వాటిలో కొన్ని ఒకదాని నొకటి పోలి ఉంటాయి, మరికొన్ని ఒకదాని నొకటి పోలి ఉండవు[2]. ఫలించినప్పుడు వాటి ఫలాలను మరియు వాటి పరిపక్వాన్ని గమనించండి. నిశ్చయంగా, వీటిలో విశ్వసించే వారికి సూచనలున్నాయి.

సూరా సూరా అనాం ఆయత 99 తఫ్సీర్


[1] ప్రతి జీవిని అల్లాహ్ (సు.తా.) నీటి నుండి పుట్టించాడు. చూడండి, 21:30. [2] అంటే కొన్ని విషయాలలో అవి ఒకదానికొకటి పోలి ఉన్నా, ఇతర విషయాలలో వారి మధ్య పోలికలు ఉండవు. అంటే వారి ఆకులు పోలి ఉండవచ్చు, కాని వాటి ఫలాల, రుచి, రంగు మరియు వాసన పరిమాణాల విషయంలో వేరుగా ఉండవచ్చు. ఉదా: వేర్వేరు రకాల మామిడి పండ్లు.

Sign up for Newsletter