కురాన్ - 21:22 సూరా సూరా అంబియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لَوۡ كَانَ فِيهِمَآ ءَالِهَةٌ إِلَّا ٱللَّهُ لَفَسَدَتَاۚ فَسُبۡحَٰنَ ٱللَّهِ رَبِّ ٱلۡعَرۡشِ عَمَّا يَصِفُونَ

వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.[1]

సూరా సూరా అంబియా ఆయత 22 తఫ్సీర్


[1] ఒకవేళ అల్లాహ్ (సు.తా.)కు సాటిగా మరొక దైవం ఉండి ఉంటే, ఇద్దరి ఆధిపత్యం నడిచేది. ప్రతి ఒక్కరూ తమ ఇచ్ఛానుసారంగా ప్రపంచాన్ని నడపగోరేవారు. దాని వల్ల విశ్వంలో ఇంత శాంతి ఉండక పోయేది. అల్లకల్లోలం చెలరేగిపోయేది. మానవుల రాజ్యపాలన ఏదైతే భూమిలోని ఒక్క చిన్న భాగం మీద ఉందో, దానికి ఒకే ఒక్క ఉన్నత పాలకుడిని ప్రసిడెంట్, లేక రాజు, లేక ప్రైమ్ మినిష్టర్ ను నియమించుకుంటాము. అలాంటప్పుడు విశ్వసామ్రాజ్య వ్యవస్థలో ఒకని కంటే ఎక్కువ పాలకులు ఉండి ఉంటే, అల్లాకల్లోలం చెలరేగదా? ఇంకా చూడండి, 6:100.

సూరా అంబియా అన్ని ఆయతలు

Sign up for Newsletter