కురాన్ - 21:96 సూరా సూరా అంబియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

حَتَّىٰٓ إِذَا فُتِحَتۡ يَأۡجُوجُ وَمَأۡجُوجُ وَهُم مِّن كُلِّ حَدَبٖ يَنسِلُونَ

ఎంత వరకైతే యాజూజ్ మరియు మాజూజ్ లు వదలి పెట్టబడి ప్రతి మిట్టనుండి పరుగెడుతూరారో![1]

సూరా సూరా అంబియా ఆయత 96 తఫ్సీర్


[1] చూడండి, 18:94-98. తీర్పుదినం దగ్గరికి వచ్చి 'ఈసా ( 'అ.స.) తిరిగి భూలోకంలోకి వచ్చినప్పుడు యూ'జూజ్ మరియు మా'జూజ్ లు ప్రపంచంలో ప్రతిచోట వ్యాపించి ఉంటారు. వారి హింసలు మరియు దౌర్జన్యాలకు విశ్వాసులు తాళ లేకపోతారు. చివరకు 'ఈసా ('అ.స.) విశ్వాసులను తీసుకొని 'తూర్ పర్వతం పైకి ఎక్కుతారు. అతను యా'జూజ్ మరియు మా'జూజ్ లను శిక్షించటానికి అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థిస్తారు. అప్పుడు వారంతా వధింపబడతారు. వారి శవాల దుర్వాసన అంతటా వ్యాపించి పోతుంది. అప్పుడు అల్లాహ్ (సు.తా.) పక్షులను పంపుతాడు. అవి ఆ శవాలను సముద్రంలోకి విసరుతాయి. ఆ తరువాత ఒక పెద్ద వర్షం కురుస్తుంది. దానితో భూమి శుభ్రపరచబడుతుంది. ('స'హీ'హ్ 'హదీస్'ల ఆధారంగా, ఇబ్నె-కసీ'ర్).

సూరా అంబియా అన్ని ఆయతలు

Sign up for Newsletter