కురాన్ - 29:27 సూరా సూరా అంకబూత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَوَهَبۡنَا لَهُۥٓ إِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَجَعَلۡنَا فِي ذُرِّيَّتِهِ ٱلنُّبُوَّةَ وَٱلۡكِتَٰبَ وَءَاتَيۡنَٰهُ أَجۡرَهُۥ فِي ٱلدُّنۡيَاۖ وَإِنَّهُۥ فِي ٱلۡأٓخِرَةِ لَمِنَ ٱلصَّـٰلِحِينَ

మరియు మేము అతనికి (ఇబ్రాహీమ్ కు) ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించి, అతని సంతతిలో ప్రవక్త పదవినీ మరియు గ్రంథాన్ని ఉంచి, ప్రపంచంలో అతనికి, అతని ప్రతిఫలాన్ని ఇచ్చాము.[1] మరియు పరలోకంలో అతడు నిశ్చయంగా, సద్వర్తనులతో పాటు ఉంటాడు.[2]

సూరా సూరా అంకబూత్ ఆయత 27 తఫ్సీర్


[1] చూఈ ప్రతిఫలమేమిటంటే అతను ఇబ్రాహీమ్ ('అ.స.) అబుల్-అంబియా అనబడ్డారు. అంటే ప్రవక్తల మూలపురుషుడు. ఎందుకంటే అతన సంతానం నుండి ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. అతని పెద్ద కుమారుడు, సయ్యిదా హాజర్ పుత్రుడైన ఇస్మాయీ'ల్ ('అ.స.) వంశం నుండి మహాప్రవక్త ము'హమ్మద్ ('స'అస) వచ్చారు. మరియు అతని రెండవ కుమారుడైన ఇ'స్హాఖ్ ('అ.స.) యొక్క కుమారుడైన యా'అఖూబ్ ('అ.స.) నుండి అతని కుమారుడైన యూసుఫ్ ('అ.స.) వచ్చారు. మరియు య'అఖూబ్ ('అ.స.) యొక్క పన్నెండు మంది కుమారుల నుండి ఇంకా ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. దావుద్, సులైమాన్, మూసా మరియు 'ఈసా ('అలైహిమ్. స.) లు అందరూ య'అఖూబ్ ('అ.స.) సంతతి వారే, అంటే ఇబ్రాహీమ్ ('అ.స.) సంతతి వారే. అందుకే యూదులు, క్రైస్తవులు, ముస్లిములే గాక ముష్రికులు కూడా ఇబ్రాహీమ్ ('అ.స.) ను ఆదరిస్తారు. ప్రతి ఒక్కరూ మేము ఇబ్రాహీమ్ ('అ.స.) ధర్మాన్నే ఆచరిస్తున్నాము అంటారు. కాని, వాస్తవానికి అతని ధర్మం, ఏకైక దైవసిద్ధాంతం (ఇస్లాం) మాత్రమే. [2] చూడండి, 16:122.

సూరా అంకబూత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter