కురాన్ - 29:40 సూరా సూరా అంకబూత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَكُلًّا أَخَذۡنَا بِذَنۢبِهِۦۖ فَمِنۡهُم مَّنۡ أَرۡسَلۡنَا عَلَيۡهِ حَاصِبٗا وَمِنۡهُم مَّنۡ أَخَذَتۡهُ ٱلصَّيۡحَةُ وَمِنۡهُم مَّنۡ خَسَفۡنَا بِهِ ٱلۡأَرۡضَ وَمِنۡهُم مَّنۡ أَغۡرَقۡنَاۚ وَمَا كَانَ ٱللَّهُ لِيَظۡلِمَهُمۡ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ

కావున ప్రతి ఒక్కరిని మేము అతని పాపానికి బదులుగా పట్టుకున్నాము. వారిలో కొందరిపైకి మేము తుఫాన్ గాలిని పంపాము.[1] మరికొందరిని ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) చిక్కించుకున్నది.[2] ఇంకా కొందరిని భూమిలోనికి అణగ ద్రొక్కాము.[3] ఇంకా ఇతరులను ముంచి వేశాము.[4] మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.

సూరా సూరా అంకబూత్ ఆయత 40 తఫ్సీర్


[1] 'తుఫాన్ గాలి 'ఆద్ జాతివారిపై వచ్చింది. [2] ఈ శిక్ష వచ్చిన వారు స'మూద్ జాతివారు. [3] ఇది ఖారూన్ కు సంభవించిన శిక్ష. [4] ఇది ఫిర్'ఔన్ మరియు అతన సైనికులకు సంభవించిన శిక్ష.

సూరా అంకబూత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter