కురాన్ - 29:62 సూరా సూరా అంకబూత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱللَّهُ يَبۡسُطُ ٱلرِّزۡقَ لِمَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦ وَيَقۡدِرُ لَهُۥٓۚ إِنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٞ

అల్లాహ్ తన దాసులలో, తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి దానిని మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి దానిని గురించి బాగా తెలుసు.[1]

సూరా సూరా అంకబూత్ ఆయత 62 తఫ్సీర్


[1] అల్లాహ్ (సు.తా.) ఇహలోకంలో ప్రసాదించే ధనసంపత్తులకు విశ్వాసంతో, సత్కార్యాలతో సంబంధం లేదు. అల్లాహ్ (సు.తా.) ధనసంపత్తులు, హోదాలు ఇచ్చేది లేక పేదవారిగా ఉంచేది కూడా మానవులను పరీక్షించడానికే. ఇహలోక జీవితం అతి స్వల్పమైనది. కానీ శాశ్వాతమైన పరలోక జీవితంలో కేవలం విశ్వాసులై సత్కార్యాలు చేసి అల్లాహ్ (సు.తా.) అనుమతితో స్వర్గం పొందిన వారికే ఎడతెగని శాశ్వత సుఖసంతోషాలు ఉంటాయి.

సూరా అంకబూత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter