Quran Quote  :  You will see no incongruity in the Merciful One's creation - 67:3

కురాన్ - 7:131 సూరా సూరా అరాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَإِذَا جَآءَتۡهُمُ ٱلۡحَسَنَةُ قَالُواْ لَنَا هَٰذِهِۦۖ وَإِن تُصِبۡهُمۡ سَيِّئَةٞ يَطَّيَّرُواْ بِمُوسَىٰ وَمَن مَّعَهُۥٓۗ أَلَآ إِنَّمَا طَـٰٓئِرُهُمۡ عِندَ ٱللَّهِ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ

ఆ పిదప వారికి మంచికాలం వచ్చినపుడు వారు: "మేము దీనికే అర్హులం!" అని అనేవారు. కాని వారికి కష్టకాలం దాపురించి నపుడు, వారు మూసా మరియు అతనితో పాటు ఉన్నవారిని తమకు అపశకునంగా పరిగణించేవారు.[1] వాస్తవానికి వారి అపశకునాలన్నీ అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి, కాని వారిలో చాలా మందికి తెలియదు.

సూరా సూరా అరాఫ్ ఆయత 131 తఫ్సీర్


[1] 'తాఇ'రున్: ఎగురుట. 'తాఇ'రుహుమ్: అపశకునం. ప్రాచీన కాలంలో శుభ - అశుభ శకునాలను పక్షులను ఎగుర వేసి అంచనా వేసేవారు. శకునాలు చూడటం ఇస్లాంలో 'హరాం. శకునాలను గురించి ఇంకా చూడండి, 3:49, 5:110, 17:13, 27:47 మరియు 36:18-19.

Sign up for Newsletter