కురాన్ - 48:27 సూరా సూరా ఫత్హ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لَّقَدۡ صَدَقَ ٱللَّهُ رَسُولَهُ ٱلرُّءۡيَا بِٱلۡحَقِّۖ لَتَدۡخُلُنَّ ٱلۡمَسۡجِدَ ٱلۡحَرَامَ إِن شَآءَ ٱللَّهُ ءَامِنِينَ مُحَلِّقِينَ رُءُوسَكُمۡ وَمُقَصِّرِينَ لَا تَخَافُونَۖ فَعَلِمَ مَا لَمۡ تَعۡلَمُواْ فَجَعَلَ مِن دُونِ ذَٰلِكَ فَتۡحٗا قَرِيبًا

వాస్తవానికి అల్లాహ్ తన ప్రవక్తకు, అతని స్వప్నాన్ని, నిజం చేసి చూపాడు.[1] అల్లాహ్ కోరితే, మీరు తప్పక శాంతియుతంగా, మీ తలలను పూర్తిగా గొరిగించుకొని లేదా తల వెంట్రుకలను కత్తిరించుకొని, మస్జిద్ అల్ హరామ్ లోకి భయపడకుండా ప్రవేశించేవారు. మీకు తెలియనిది ఆయనకు తెలుసు, ఇక ఇదే కాక సమీపంలోనే మీకు మరొక విజయాన్ని కూడా ప్రసాదించ బోతున్నాడు.[2]

సూరా సూరా ఫత్హ్ ఆయత 27 తఫ్సీర్


[1] దైవప్రవక్త ('స'అస) తన సహచరులతో (ర'ది.'అన్హుమ్) సహా ఇ'హ్రామ్ ధరించి 'హరమ్ లో ప్రవేశించినట్లు చూసిన స్వప్నం. అది 7వ హిజ్రీలో పూర్తి అయింది. అప్పుడు వారంతా 'ఉమ్రా చేసారు. [2] అంటే మక్కా, 'ఖైబర్ మరియు ముస్లింలకు లభించిన ఇతర విజయాలు.

సూరా ఫత్హ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter