కురాన్ - 57:13 సూరా సూరా హదీద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَوۡمَ يَقُولُ ٱلۡمُنَٰفِقُونَ وَٱلۡمُنَٰفِقَٰتُ لِلَّذِينَ ءَامَنُواْ ٱنظُرُونَا نَقۡتَبِسۡ مِن نُّورِكُمۡ قِيلَ ٱرۡجِعُواْ وَرَآءَكُمۡ فَٱلۡتَمِسُواْ نُورٗاۖ فَضُرِبَ بَيۡنَهُم بِسُورٖ لَّهُۥ بَابُۢ بَاطِنُهُۥ فِيهِ ٱلرَّحۡمَةُ وَظَٰهِرُهُۥ مِن قِبَلِهِ ٱلۡعَذَابُ

ఆ రోజు కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు విశ్వాసులతో ఇలా అంటారు:[1] "మీరు మా కొరకు కొంచెం వేచి ఉండండి, మేము మీ వెలుగు నుండి కొంచెం తీసుకుంటాము."[2] వారితో ఇలా అనబడుతుంది: "మీరు వెనుకకు మరలి పొండి, తరువాత వెలుగు కొరకు వెదకండి!" అప్పుడు వారి మధ్య ఒక గోడ నిలబెట్టబడుతుంది. దానికి ఒక ద్వారముంటుంది, దాని లోపలి వైపు కారుణ్యముంటుంది[3] మరియు దాని బయటవైపు శిక్ష ఉంటుంది.[4]

సూరా సూరా హదీద్ ఆయత 13 తఫ్సీర్


[1] చూడండి, 29:11. [2] కపటవిశ్వాసులైన స్త్రీపురుషులు కొంతదూరం విశ్వాసుల వెలుగులో నడిచిన తరువాత, అల్లాహ్ (సు.తా.) వారిపై చీకటిని విధిస్తాడు. అప్పుడు వారు అలా పలుకుతారు. [3] అంటే స్వర్గం. [4] అంటే నరకం.

సూరా హదీద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter