కురాన్ - 57:27 సూరా సూరా హదీద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ثُمَّ قَفَّيۡنَا عَلَىٰٓ ءَاثَٰرِهِم بِرُسُلِنَا وَقَفَّيۡنَا بِعِيسَى ٱبۡنِ مَرۡيَمَ وَءَاتَيۡنَٰهُ ٱلۡإِنجِيلَۖ وَجَعَلۡنَا فِي قُلُوبِ ٱلَّذِينَ ٱتَّبَعُوهُ رَأۡفَةٗ وَرَحۡمَةٗۚ وَرَهۡبَانِيَّةً ٱبۡتَدَعُوهَا مَا كَتَبۡنَٰهَا عَلَيۡهِمۡ إِلَّا ٱبۡتِغَآءَ رِضۡوَٰنِ ٱللَّهِ فَمَا رَعَوۡهَا حَقَّ رِعَايَتِهَاۖ فَـَٔاتَيۡنَا ٱلَّذِينَ ءَامَنُواْ مِنۡهُمۡ أَجۡرَهُمۡۖ وَكَثِيرٞ مِّنۡهُمۡ فَٰسِقُونَ

ఆ తరువాత చాలా మంది ప్రవక్తలను మేము వారి తరువాత పంపాము. మరియు మర్యమ్ కుమారుడు ఈసాను కూడా పంపాము మరియు అతనికి ఇంజీల్ ను ప్రసాదించాము. మరియు అతనిని అనుసరించేవారి హృదయాలలో మేము జాలిని, కరుణను కలిగించాము, కాని సన్యాసాన్ని[1] వారే స్వయంగా కల్పించుకున్నారు. మేము దానిని వారిపై విధించలేదు, కాని అల్లాహ్ ప్రసన్నతను పొందగోరి వారే దానిని విధించుకున్నారు, కాని వారు దానిని పాటించవలసిన విధంగా నిజాయితీతో పాటించలేదు. కావున వారిలో విశ్వసించిన వారికి వారి ప్రతిఫలాన్ని ప్రసాదించాము. కాని వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు.

సూరా సూరా హదీద్ ఆయత 27 తఫ్సీర్


[1] కఠోరమైన సన్యాసాన్ని వారే (క్రైస్తవులే) తమపై తాము విధించుకున్నారు. వారు ప్రాపంచిక జీవితానికి విలువ ఇవ్వలేదు. దీనిని ఖుర్ఆన్ ఖండిస్తుంది. చూడండి, 2:143. రఅ'ఫతన్ - అంటే జాలి, కనికరం, దయ. రుహ్ బానియ్యహ్ - అంటే త్యాగం, విడిచిపెట్టడం. అంటే ప్రాపంచిక విషయాలను త్యజించటం. అంటే సన్యాసత్వం స్వీకరించటం. ఇది వారే స్వయంగా కల్పించుకున్నారు. అల్లాహ్ (సు.తా.) దీనిని విధించలేదు. వారు అల్లాహ్ (సు.తా.) ను సంతోషపరచాలని దీనిని అవలంబించారు. కాని అల్లాహ్ (సు.తా.) తాను చూపిన మార్గం పై నడిచే వారితోనే సంతోషపడతాడు. దానిలో క్రొత్త విషయాలను పుట్టించి వాటిని అవలంబించే వారితో కాదు.

సూరా హదీద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter