కురాన్ - 22:47 సూరా సూరా హజ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَيَسۡتَعۡجِلُونَكَ بِٱلۡعَذَابِ وَلَن يُخۡلِفَ ٱللَّهُ وَعۡدَهُۥۚ وَإِنَّ يَوۡمًا عِندَ رَبِّكَ كَأَلۡفِ سَنَةٖ مِّمَّا تَعُدُّونَ

మరియు (ఓ ముహమ్మద్!) వారు నిన్ను శిక్ష కొరకు తొందర పెడుతున్నారు.[1] కాని అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగపరచడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్ద ఒక్క దినం మీ లెక్కల ప్రకారం వేయి సంవత్సరాలకు సమానమైనది.[2]

సూరా సూరా హజ్ ఆయత 47 తఫ్సీర్


[1] చూడండి, 6:57, 8:32 మరియు 13:6. [2] మానవుల 'కాలగణనం' భూమి, సూర్యచంద్రుల సంచారంతో బంధింపబడివుంది. అల్లాహ్ (సు.తా.) కాలానికి పరిమితుడైనవాడు కాడు. ఆయన అంతర్యామి. ఆయనకు మొదలు, ముగింపు అనేవి లేవు. ఏవైతే కాలానికి సంబంధించినవో! ఇంకా చూడండి, 70:4. అక్కడ ఒక దినం ఏబది వేల సంవత్సరాలతో సమానమనబడింది. దీనిని సమర్థించటానికి ఎన్నో 'స'హీ'హ్ హదీస్'లున్నాయి. అల్లాహ్ (సు.తా.) అన్నాడు: 'నేనే కాలాన్ని (అద్దహ్ర్).'

సూరా హజ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter