కురాన్ - 22:73 సూరా సూరా హజ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ ضُرِبَ مَثَلٞ فَٱسۡتَمِعُواْ لَهُۥٓۚ إِنَّ ٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ لَن يَخۡلُقُواْ ذُبَابٗا وَلَوِ ٱجۡتَمَعُواْ لَهُۥۖ وَإِن يَسۡلُبۡهُمُ ٱلذُّبَابُ شَيۡـٔٗا لَّا يَسۡتَنقِذُوهُ مِنۡهُۚ ضَعُفَ ٱلطَّالِبُ وَٱلۡمَطۡلُوبُ

ఓ మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది, దానిని శ్రద్ధగా వినండి! నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. మరియు ఒకవేళ, ఆ ఈగ వారి నుండి ఏమైనా లాక్కొని పోయినా, వారు దానిని, దాని (ఆ ఈగ) నుండి విడిపించుకోనూ లేరు.[1] ఎంత బలహీనులు, ఈ అర్థించేవారు మరియు అర్థించబడేవారు.

సూరా సూరా హజ్ ఆయత 73 తఫ్సీర్


[1] ఇక్కడ మానవులు అల్లాహ్ (సు.తా.)ను వదలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు అంటే, మూర్తులు, దర్గాలు, సన్యాసులు, దైవ అవతారులుగా భావించబడే వారు, అల్లాహ్ కుమారులుగా భావించబడేవారు, దైవదూతలు, ప్రవక్తలు మొదలైన వారంతా అని అర్థము.

సూరా హజ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter