కురాన్ - 3:110 సూరా సూరా అలి ఇమ్రాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

كُنتُمۡ خَيۡرَ أُمَّةٍ أُخۡرِجَتۡ لِلنَّاسِ تَأۡمُرُونَ بِٱلۡمَعۡرُوفِ وَتَنۡهَوۡنَ عَنِ ٱلۡمُنكَرِ وَتُؤۡمِنُونَ بِٱللَّهِۗ وَلَوۡ ءَامَنَ أَهۡلُ ٱلۡكِتَٰبِ لَكَانَ خَيۡرٗا لَّهُمۚ مِّنۡهُمُ ٱلۡمُؤۡمِنُونَ وَأَكۡثَرُهُمُ ٱلۡفَٰسِقُونَ

మీరే (విశ్వాసులే) మానవజాతి (హితం) కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజం వారు. మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు[1]. మరియు ఒకవేళ గ్రంథప్రజలు విశ్వసిస్తే, వారికే మేలై ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు[2]. కాని అత్యధికులు అవిధేయులే (ఫాసిఖూన్).

సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 110 తఫ్సీర్


[1] అబూహురైరా కథనం: "మీరే (సత్యధర్మమైన ఇస్లాంను మరియు దైవప్రవక్త ('స'అస) సున్నతులను అనుసరించే వారే), ఉత్తమమైన మానవసమాజానికి చెందినవారు." ('స. బు'ఖారీ పుస్తకం - 6, 'హదీస్' నం. 80). [2] 'అబ్దుల్లాహ్ బిన్ - సల్లాం (ర'ది. 'అ.) వంటి వారు.

Sign up for Newsletter