కురాన్ - 3:117 సూరా సూరా అలి ఇమ్రాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

مَثَلُ مَا يُنفِقُونَ فِي هَٰذِهِ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا كَمَثَلِ رِيحٖ فِيهَا صِرٌّ أَصَابَتۡ حَرۡثَ قَوۡمٖ ظَلَمُوٓاْ أَنفُسَهُمۡ فَأَهۡلَكَتۡهُۚ وَمَا ظَلَمَهُمُ ٱللَّهُ وَلَٰكِنۡ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ

వారు ఈ ఇహలోక జీవితంలో చేస్తున్న ధన వ్యయాన్ని, తమకు తాము అన్యాయం చేసుకున్నవారి పొలాలపై వీచి వాటిని సమూలంగా నాశనం చేసే, మంచు గాలితో పోల్చవచ్చు. మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు. కానీ వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.[1]

సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 117 తఫ్సీర్


[1] సత్యతిరస్కారుల దానధర్మాలు గానీ, పుణ్యకార్యాలు గానీ వారికి పరలోక జీవితంలో ఏ విధంగాను పనికిరావు ఎందుకంటే విశ్వాసం లేని దానాలు ఫలించవు. మోక్షానికి మూలం విశ్వాసమే. చూడండి, 3:85.

Sign up for Newsletter