కురాన్ - 3:118 సూరా సూరా అలి ఇమ్రాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُواْ بِطَانَةٗ مِّن دُونِكُمۡ لَا يَأۡلُونَكُمۡ خَبَالٗا وَدُّواْ مَا عَنِتُّمۡ قَدۡ بَدَتِ ٱلۡبَغۡضَآءُ مِنۡ أَفۡوَٰهِهِمۡ وَمَا تُخۡفِي صُدُورُهُمۡ أَكۡبَرُۚ قَدۡ بَيَّنَّا لَكُمُ ٱلۡأٓيَٰتِۖ إِن كُنتُمۡ تَعۡقِلُونَ

ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని (విశ్వాసులను) తప్ప ఇతరులను మీ సన్నిహిత స్నేహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించు కోవటానికి వెనుకాడరు. వారు మిమ్మల్ని ఇబ్బందిలో చూడగోరుతున్నారు. మరియు వారి ఈర్ష్య వారి నోళ్ళ నుండి బయటపడుతున్నది. కాని వారి హృదయాలలో దాచుకున్నది దాని కంటే తీవ్రమైనది. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టం చేశాము. మీరు అర్థం చేసుకోగలిగితే (ఎంత బాగుండేది)! [1]

సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 118 తఫ్సీర్


[1] చూడండి, 60:8-9 ఎవరైతే మీ ధర్మం కారణంగా మిమ్మల్ని విరోధించక మీకు హాని చేయక, మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొట్టరో, అట్టివారితో మీరు కరుణతో న్యాయంతో వ్యవహరించండి. కాని ఎవరైతే మీ ధర్మం కారణంగా మీతో పోరాడి మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొడతారో, అలాంటి వారు మీ స్నేహితులు కారు, వారితో ధర్మయుద్ధం (జిహాద్) చేయండి.

Sign up for Newsletter