కురాన్ - 3:165 సూరా సూరా అలి ఇమ్రాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَوَلَمَّآ أَصَٰبَتۡكُم مُّصِيبَةٞ قَدۡ أَصَبۡتُم مِّثۡلَيۡهَا قُلۡتُمۡ أَنَّىٰ هَٰذَاۖ قُلۡ هُوَ مِنۡ عِندِ أَنفُسِكُمۡۗ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ

ఏమయిందీ? మీకొక చిన్న ఆపదే కదా కలిగింది! వాస్తవానికి మీరు, వారికి (మీ శత్రువులను బద్ర్ లో) ఇంతకు రెట్టింపు ఆపద కలిగించారు కదా![1] అయితే ఇప్పుడు: "ఇది ఎక్కడి నుంచి వచ్చిందీ?" అని అంటున్నారా? వారితో ఇలా అను: "ఇది మీరు స్వయంగా తెచ్చుకున్నదే!"[2] నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.

సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 165 తఫ్సీర్


[1] ఉ'హుద్ లో 70 మంది ముస్లింలు మరణించారు, కానీ బద్ర్ లో 70 మంది ముష్రికులు మరణించారు, మరియు 70 మంది బందీలయ్యారు కదా! [2] అంటే దైవప్రవక్త ('స'అస) యొక్క ఆజ్ఞను పాలించక 'స'హాబా (ర'ది.'అన్హుమ్)లు బూటీ కొరకు గుట్టపై నుండి తమ స్థానాలు వదలిపోయినందుకు ఈ ఆపదకు గురి అయ్యారు.

Sign up for Newsletter