కురాన్ - 3:173 సూరా సూరా అలి ఇమ్రాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱلَّذِينَ قَالَ لَهُمُ ٱلنَّاسُ إِنَّ ٱلنَّاسَ قَدۡ جَمَعُواْ لَكُمۡ فَٱخۡشَوۡهُمۡ فَزَادَهُمۡ إِيمَٰنٗا وَقَالُواْ حَسۡبُنَا ٱللَّهُ وَنِعۡمَ ٱلۡوَكِيلُ

వారితో (విశ్వాసులతో) ప్రజలు: "వాస్తవానికి, మీకు వ్యతిరేకంగా పెద్ద జన సమూహాలు కూర్చబడి ఉన్నాయి, కావున మీరు వారికి భయపడండి." అని అన్నప్పుడు, వారి విశ్వాసం మరింత అధికమే అయింది. మరియు వారు: "మాకు అల్లాహ్ యే చాలు మరియు ఆయనే సర్వోత్తమమైన కార్యసాధకుడు." [1] అని అన్నారు.[2]

సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 173 తఫ్సీర్


[1] అల్-వకీలు: అంటే Trustee, Overseer, Guardian, Disposer of affairs, కార్యకర్త, సంరక్షకుడు, కార్యనిర్వాహకుడు, కార్యసాధకుడు, సాక్షి, బాధ్యుడు, ధర్మకర్త, మొదలైన అర్థాలున్నాయి. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 4:109, 6:102, 11:12, 17:2. [2] చూడండి, 'స. బు'ఖారీ, పు. 6, 'హదీస్' నం. 86, 87.

Sign up for Newsletter