కురాన్ - 3:199 సూరా సూరా అలి ఇమ్రాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِنَّ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ لَمَن يُؤۡمِنُ بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيۡكُمۡ وَمَآ أُنزِلَ إِلَيۡهِمۡ خَٰشِعِينَ لِلَّهِ لَا يَشۡتَرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ ثَمَنٗا قَلِيلًاۚ أُوْلَـٰٓئِكَ لَهُمۡ أَجۡرُهُمۡ عِندَ رَبِّهِمۡۗ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلۡحِسَابِ

మరియు నిశ్చయంగా, గ్రంథ ప్రజలలో, కొందరు అల్లాహ్ ను విశ్వసిస్తారు. మరియు వారు మీకు అవతరింపజేయబడిన దానిని మరియు వారికి అవతరింపజేయబడిన దానిని (సందేశాన్ని) విశ్వసించి, అల్లాహ్ కు వినమ్రులై, అల్లాహ్ సూక్తులను స్వల్పమైన మూల్యానికి అమ్ముకోరు[1]. అలాంటి వారికి వారి ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంది. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.

సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 199 తఫ్సీర్


[1] ఈ ఆయత్ లో దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) ను విశ్వసించిన పూర్వగ్రంథ ప్రజలను గురించి చెప్పబడింది. ఉదా: 'అబ్దుల్లాహ్ బిన్ సల్లామ్, మరియు సల్మాన్ పార్సీ మొదలైనవారు. (ర'ది.'అన్హుమ్). వారిలో దాదాపు 10 మంది మాత్రమే యూదులు, కాని క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉండిరి. (ఇబ్నె - కసీ'ర్).

Sign up for Newsletter