కురాన్ - 3:45 సూరా సూరా అలి ఇమ్రాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِذۡ قَالَتِ ٱلۡمَلَـٰٓئِكَةُ يَٰمَرۡيَمُ إِنَّ ٱللَّهَ يُبَشِّرُكِ بِكَلِمَةٖ مِّنۡهُ ٱسۡمُهُ ٱلۡمَسِيحُ عِيسَى ٱبۡنُ مَرۡيَمَ وَجِيهٗا فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِ وَمِنَ ٱلۡمُقَرَّبِينَ

దేవదూతలు ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ మర్యమ్! నిశ్చయంగా, అల్లాహ్! నీకు తన వాక్కును గురించి శుభవార్తను ఇస్తున్నాడు.[1] అతని పేరు: "మసీహ్ ఈసా ఇబ్నె మర్యమ్. అతను ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ గౌరవనీయుడైనవాడై మరియు (అల్లాహ్) సామీప్యం పొందినవారిలో ఒకడై ఉంటాడు.

సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 45 తఫ్సీర్


[1] ఈ ఆయత్ లో కలిమతుల్లాహ్, అల్లాహ్ (సు.తా.) వాక్కు అని 'ఈసా ('అ.స.) సంబోధించబడ్డారు. అంటే అతను తండ్రి లేకుండా కేవలం అల్లాహుతా'ఆలా వాక్కు ద్వారా : "అయిపో" అని అనగానే, (తన తల్లి - మర్యమ్ గర్భంలో) అయిపోయారు; ఏ విధంగానైతే ఆదమ్ ('అ.స.) ను అల్లాహ్ (సు.తా.) తల్లి - దండ్రి లేనిదే మరియు 'హవ్వాను తల్లి లేనిదే సృష్టించాడో! చూడండి, 3:59.

Sign up for Newsletter