ఆయనే ఆ నిరక్ష్యరాస్యులైన[1] వారిలో నుండి ఒక సందేశహరుణ్ణి లేపాడు. అతను వారికి ఆయన సూచనలను (ఆయాత్ లను) చదివి వినిపిస్తున్నాడు మరియు వారిని సంస్కరిస్తున్నాడు మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు. మరియు వాస్తవానికి వారు, అంతకు పూర్వం స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉండేవారు.
సూరా సూరా జుమువా ఆయత 2 తఫ్సీర్
[1] అల్-ఉమ్మియ్యూన: నిరక్షరాస్యులు. అంటే ఆ కాలంలో అరబ్బులలో చాలా మందికి చదవటం వ్రాయటం వచ్చేది కాదు. స్వయంగా ప్రవక్త ('స'అస) కూడా నిరక్షరాస్యులే. చూడండి, 7:157-158.
సూరా సూరా జుమువా ఆయత 2 తఫ్సీర్