Quran Quote  :  The wrong-doers will be told : "Verily you and the gods you worshiped beside Allah are the fuel of Hell". - 21:98

కురాన్ - 18:27 సూరా సూరా కహఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱتۡلُ مَآ أُوحِيَ إِلَيۡكَ مِن كِتَابِ رَبِّكَۖ لَا مُبَدِّلَ لِكَلِمَٰتِهِۦ وَلَن تَجِدَ مِن دُونِهِۦ مُلۡتَحَدٗا

మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు గ్రంథం నుండి నీపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) చదివి వినిపించు.[1] ఆయన ప్రవచనాలను ఎవ్వడూ మార్చలేడు. మరియు ఆయన వద్ద తప్ప నీవు మరెక్కడా శరణు పొందలేవు. [2]

సూరా సూరా కహఫ్ ఆయత 27 తఫ్సీర్


[1] గుహవారి కథ వినిపిస్తూ అల్లాహుతా'ఆలా అలా అంటున్నాడు:'ఇప్పుడు నిన్ను ప్రశించేవారికి ఇది వినిపించు.' వాస్తవానికి ('స'అస) ఎల్లప్పుడు తనపై అవతరింపజేయబడిన దివ్య జ్ఞానాన్నంతా ప్రజలకు వినిపించారు. మరియు వారిని సన్మార్గం వైపునకు పిలిచారు. అది అతని ('స'అస) విద్యుక్త ధర్మం. అల్లాహ్ (సు.తా.) దాని కొరకే ప్రవక్తలను ఎన్నుకుంటాడు. [2] అల్లాహ్ (సు.తా.) ప్రవచనాలను ఉన్నవి ఉన్నట్లుగా ఎట్టి మార్పులు చేయకుండా వినిపించాలని ఆజ్ఞ ఇవ్వబడుతోంది. లేనిచో అల్లాహ్ (సు.తా.) శిక్ష నుండి తప్పించేవాడు ఎవ్వడూ లేడు. ఈ ప్రవచనం దైవప్రవక్త ('స'అస) తో చెప్పబడినా అది సర్వసమాజం కొరకు వర్తిస్తుంది.

సూరా కహఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter