మరియు వారికి ఆదమ్ యొక్క ఇద్దరు కుమారుల[1] (హాబిల్ మరియు ఖాబిల్ ల) యథార్థ కథను వినిపించు. వారిద్దరు (అల్లాహ్ కు) బలి (ఖుర్బానీ) ఇచ్చి నప్పుడు ఒకని (హాబిల్) బలి స్వీకరించ బడింది మరియు రెండవ వాని (ఖాబీల్) బలి స్వీకరించ బడలేదు. (ఖాబీల్) అన్నాడు: "నిశ్చయంగా నేను నిన్ను చంపుతాను." (దానికి హాబీల్) అన్నాడు: "నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గలవారి (బలినే) స్వీకరిస్తాడు.
సూరా సూరా మైదా ఆయత 27 తఫ్సీర్
[1] హాబిల్ మరియు ఖాబిల్ ఆదమ్ ('అ.స.) యొక్క ఇద్దరు కుమారులు. బైబిల్ లో వీరు ఏబిల్ (Abel) మరియు కేన్ (Cain)గా పేర్కొనబడ్డారు. హాబిల్ (Abel) ను ఖాబిల్ (Cain) చంపాడు.
సూరా సూరా మైదా ఆయత 27 తఫ్సీర్