కురాన్ - 5:35 సూరా సూరా మైదా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَٱبۡتَغُوٓاْ إِلَيۡهِ ٱلۡوَسِيلَةَ وَجَٰهِدُواْ فِي سَبِيلِهِۦ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి.[1] మరియు ఆయన మార్గంలో నిరంతరం కృషి చేస్తే మీరు సాఫల్యం పొంద వచ్చు![2]

సూరా సూరా మైదా ఆయత 35 తఫ్సీర్


[1] వసీల: మార్గం, అంటే తాను కోరిన దానిని పొందటానికి లేక దానికి సన్నిహితు లవటానికి సహాయపడేది. అంటే దైవభీతి మరియు సద్వర్తన మరియు అల్లాహ్ (సు.తా.) 'హరాం చేసిన వాటి నుండి దూరంగా ఉండటం. కాని మూర్ఖులు ఈ సత్యాన్ని విడిచి గోరీలలో ఉన్నా వారిని తమకు వసీలాగా భావిస్తున్నారు. షరీ'అత్ లో ఇలాంటి అపోహలకు ఎలాంటి స్థానం లేదు. ('స'హీ'హ్ బు'ఖారీ, కితాబ్ అల్ - అ'జాన్ మరియు 'స'హీ'హ్ ముస్లిం, కితాబ్ అ'స్సలాహ్). అ'జాన్ తరువాత చదువ వలసిన దు'ఆయే వసీలా అది: "అల్లాహుమ్మ రబ్బ హాజి హిద్ద'అవతి త్తామ్మతి, వ'స్సలాతిల్ ఖాయి'మతి, ఆతి ము'హమ్మదన్ వసీలత వల్ - ఫ'దీలత, వబ్'అస్ హు మకామమ్ మ'హ్ మూ దల్లజీ' వఅద్తహు." స్వర్గంలో నబీ ('స'అస) కు ప్రసాదించబడిన మకామె మ'హమూద్ కూడా వసీల అనబడుతుంది. కావున ఎవడైతే అ'జాన్ తరువాత పై దు'ఆ చేస్తాడో అతడు నా సిఫారసుకు యోగ్యుడవుతాడు అని మహా ప్రవక్త ('స'అస) అన్నారు. [2] చూడండి, 2:186.

సూరా మైదా అన్ని ఆయతలు

Sign up for Newsletter