కురాన్ - 5:46 సూరా సూరా మైదా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَفَّيۡنَا عَلَىٰٓ ءَاثَٰرِهِم بِعِيسَى ٱبۡنِ مَرۡيَمَ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلتَّوۡرَىٰةِۖ وَءَاتَيۡنَٰهُ ٱلۡإِنجِيلَ فِيهِ هُدٗى وَنُورٞ وَمُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلتَّوۡرَىٰةِ وَهُدٗى وَمَوۡعِظَةٗ لِّلۡمُتَّقِينَ

మరియు మేము వారి (ఆ ప్రవక్తల) అడుగు జాడలను (ఆసారిహిమ్) అనుసరించేవాడు మరియు తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరచే వాడయిన, మర్యమ్ కుమారుడు ఈసా (ఏసును) పంపాము.[1] మేము అతనికి ఇంజీల్ గ్రంథాన్ని ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి మరియు అది తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం కూడా!

సూరా సూరా మైదా ఆయత 46 తఫ్సీర్


[1] మూసా ('అ.స.) పై అవతరింపజేయబడిన తౌరాత్ గ్రంథం తరువాత అల్లాహ్ (సు.తా.) 'ఈసా ('అ.స.) పై ఇంజీల్ ను అవతరింపజేశాడు. అతను తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరిచారు. 'ఈసా ('అ.స.) : "ఇస్రాయీ'ల్ సంతతిలోని దారి తప్పిన గొర్రెల వద్దకే తప్ప ఇతరుల వద్దకు నేను పంపబడలేదు." అని అన్నారు. మత్తయి - (Mathew), 15:24. ఇక ము'హమ్మద్ ('స'అస) వచ్చారు. అతనికపై ఖుర్ఆన్ అవతరింపజేయబడింది. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది. ఈ ఖుర్ఆన్ 1400 సంవత్సరాలలో, దానిలోని ఒక్క అక్షరమైనా మార్చబడకుండా, దాని అసలు రూపంలో భద్రపరచబడి ఉన్న ఏకైక, దివ్యగ్రంథం. ఎందుకంటే పునరుత్థానదినం వరకు నేను ఈ ఖుర్ఆన్ ను దాని అసలు రూపంలో భద్రపరుస్తానని అల్లాహ్ (సు.తా.) వాగ్దానం చేశాడు, చూడండి.15:9. ఇది ర'హ్మతుల్లిల్ 'ఆలమీన్ - అంటే సర్వలోకాల వారికి కారుణ్యం. ఇది సర్వలోకాల వారి కొరకు అవతరింజేయబడింది. ము'హమ్మద్ ('స'అస) చిట్టచివరి ప్రవక్త. అతనిపై అవతరింపజేయబడిన ఈ దివ్యఖుర్ఆన్ చిట్ట చివరి దివ్యగ్రంథం.

సూరా మైదా అన్ని ఆయతలు

Sign up for Newsletter