కురాన్ - 5:5 సూరా సూరా మైదా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱلۡيَوۡمَ أُحِلَّ لَكُمُ ٱلطَّيِّبَٰتُۖ وَطَعَامُ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ حِلّٞ لَّكُمۡ وَطَعَامُكُمۡ حِلّٞ لَّهُمۡۖ وَٱلۡمُحۡصَنَٰتُ مِنَ ٱلۡمُؤۡمِنَٰتِ وَٱلۡمُحۡصَنَٰتُ مِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ إِذَآ ءَاتَيۡتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحۡصِنِينَ غَيۡرَ مُسَٰفِحِينَ وَلَا مُتَّخِذِيٓ أَخۡدَانٖۗ وَمَن يَكۡفُرۡ بِٱلۡإِيمَٰنِ فَقَدۡ حَبِطَ عَمَلُهُۥ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ

ఈనాడు మీ కొరకు పరిశుద్ధమైన వస్తువులన్నీ ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు గ్రంథ ప్రజల ఆహారం[1] మీకు ధర్మ సమ్మతమైనది మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథ ప్రజల స్త్రీలు గానీ,[2] మీరు వారికి వారి మహ్ర్ చెల్లించి, న్యాయబద్ధంగా వారితో వివాహ జీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగచాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు.

సూరా సూరా మైదా ఆయత 5 తఫ్సీర్


[1] గ్రంథప్రజల ఆహారం అంటే, ఏదైతే అల్లాహ్ పేరుతో జి'బ్'హ్ చేయబడి రక్తం ప్రవహింపజేయబడిందో అదే. కాని మొదట మత్తు చేయబడి తరువాత గొంతు కోయబడినది కాదు. ఏ ఆహారపదార్థాలైతే ఇస్లాం ధర్మశాసనం ప్రకారం హరాం చేయబడ్డాయో వాటిని విడిచి. [2] పూర్వగ్రంథ ప్రజల స్త్రీల విషయం: వారు ఆధునిక భావాల వారై, ఇప్పుడు పశ్చిమ దేశాలలో, నడుస్తున్న సాంఘిక విచారాలను సమర్థించేవారైతే గ్రంథ ప్రజలతో వివాహం ధర్మసమ్మతమైనా వారి నడకలు 'హరాం అయితే, అట్టి స్త్రీలతో వివాహం చేసుకోవటం ఏ విధంగా ధర్మసమ్మతం కాగలదో ఆలోచించవలసిన విషయం. ప్రస్తుత కాలంలో చాలా మంది గ్రంథ ప్రజలు వారి ధర్మం క్రైస్తవ ధర్మం గానీ, యూద ధర్మం గానీ, వారు దాని నుండి చాలా దూరంలో ఉంన్నారు. కావున మీరు ఏ స్త్రీతోనైనా వివాహమాడదలచుకున్నపుడు ఆమె సుశీలవతి అయి ఉండి, విచ్ఛలవిడిగా తిరిగే స్త్రీ కాకుండా ఉండటం ఎంతో ముఖ్యం. ఇంకా మీరు మీ స్త్రీలకు గ్రంథ ప్రజలతో పెండ్లి చేయించకండి. ఎందుకంటే మీరు ముస్లింలు దైవప్రవక్తలను అందరినీ నమ్ముతారు. ఆదరిస్తారరు. కాని వారు, ఉదాహరణకు యూదులు, 'ఈసా ('అ.స.)ను మరియు ము'హమ్మద్ ('స'అస)ను దైవప్రవక్తని నమ్మరు. కాబట్టి ఒక ముస్లిం స్త్రీ యూదుణ్ణి లేక క్రైస్తవుణ్ణి పెండ్లి చేసుకుంటే, ఆమె వారింట్లో ము'హమ్మద్ ('స'అస) పట్ల దూషణలు ఎలా వినగలదు?

సూరా మైదా అన్ని ఆయతలు

Sign up for Newsletter