మరియు వాస్తవానికి వారు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు వారి ప్రభువు తరఫు నుండి వారిపై (ఇప్పుడు) అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) ఆచరించి ఉండినట్లైతే, వారి కొరకు వారిపై (ఆకాశం) నుండి మరియు కాళ్ళ క్రింది నుండి (భూమి నుండి) జీవనోపాధి పొందేవారు.[1] వారిలో కొందరు సరైన మార్గాన్ని అవలంబించే వారున్నారు.[2] కాని వారిలో అనేకులు చేసేవి చెడు (పాప) కార్యాలే!
సూరా సూరా మైదా ఆయత 66 తఫ్సీర్
[1] చూడండి, 7:96. [2] 'అబ్దుల్లాహ్ బిన్ సల్లాం మరికొందరు 8-9 మంది మదీనాలోని యూదులు మాత్రమే విశ్వసించారు.
సూరా సూరా మైదా ఆయత 66 తఫ్సీర్