కురాన్ - 5:75 సూరా సూరా మైదా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

مَّا ٱلۡمَسِيحُ ٱبۡنُ مَرۡيَمَ إِلَّا رَسُولٞ قَدۡ خَلَتۡ مِن قَبۡلِهِ ٱلرُّسُلُ وَأُمُّهُۥ صِدِّيقَةٞۖ كَانَا يَأۡكُلَانِ ٱلطَّعَامَۗ ٱنظُرۡ كَيۡفَ نُبَيِّنُ لَهُمُ ٱلۡأٓيَٰتِ ثُمَّ ٱنظُرۡ أَنَّىٰ يُؤۡفَكُونَ

మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు.[1] చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి![2] ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)!

సూరా సూరా మైదా ఆయత 75 తఫ్సీర్


[1] మర్యమ్ తాను అల్లాహ్ తల్లినని ఎన్నడూ అనలేదు. 'ఈసా ('అ.స.) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అల్లాహుతా'ఆలా కుమారుడు గానీ, అల్లాహ్ గానీ కారు. చూడండి, 5:73. [2] మేము పంపిన ప్రవక్తలందరూ పురుషులే 12:109.

సూరా మైదా అన్ని ఆయతలు

Sign up for Newsletter