కురాన్ - 5:95 సూరా సూరా మైదా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَقۡتُلُواْ ٱلصَّيۡدَ وَأَنتُمۡ حُرُمٞۚ وَمَن قَتَلَهُۥ مِنكُم مُّتَعَمِّدٗا فَجَزَآءٞ مِّثۡلُ مَا قَتَلَ مِنَ ٱلنَّعَمِ يَحۡكُمُ بِهِۦ ذَوَا عَدۡلٖ مِّنكُمۡ هَدۡيَۢا بَٰلِغَ ٱلۡكَعۡبَةِ أَوۡ كَفَّـٰرَةٞ طَعَامُ مَسَٰكِينَ أَوۡ عَدۡلُ ذَٰلِكَ صِيَامٗا لِّيَذُوقَ وَبَالَ أَمۡرِهِۦۗ عَفَا ٱللَّهُ عَمَّا سَلَفَۚ وَمَنۡ عَادَ فَيَنتَقِمُ ٱللَّهُ مِنۡهُۚ وَٱللَّهُ عَزِيزٞ ذُو ٱنتِقَامٍ

ఓ విశ్వాసులారా! మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి.[1] మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా వేట చేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించుకోవాలి. దానిని (ఆ పశువును) మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు కఅబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా - తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవిచూడటానికి - ఉపవాసముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగలవాడు.

సూరా సూరా మైదా ఆయత 95 తఫ్సీర్


[1] మీకు హానికలిగించ గల జంతువులను, ఇ'హ్రామ్ స్థితిలో చంపవచ్చు. ఉదా: పాము, తేలు, పిచ్చికుక్క మొదలైనవి. పేదలకు భోజనం పెట్టడం మరియు ఉపవాస విషయాలలో ధర్మవేత్తలను సంప్రదించండి. ఇవి చంపబడిన జంతువును బట్టి వివిధ రకాలు ఉంటాయి.

సూరా మైదా అన్ని ఆయతలు

Sign up for Newsletter