కురాన్ - 58:8 సూరా సూరా ముజాదిలా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ نُهُواْ عَنِ ٱلنَّجۡوَىٰ ثُمَّ يَعُودُونَ لِمَا نُهُواْ عَنۡهُ وَيَتَنَٰجَوۡنَ بِٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِ وَمَعۡصِيَتِ ٱلرَّسُولِۖ وَإِذَا جَآءُوكَ حَيَّوۡكَ بِمَا لَمۡ يُحَيِّكَ بِهِ ٱللَّهُ وَيَقُولُونَ فِيٓ أَنفُسِهِمۡ لَوۡلَا يُعَذِّبُنَا ٱللَّهُ بِمَا نَقُولُۚ حَسۡبُهُمۡ جَهَنَّمُ يَصۡلَوۡنَهَاۖ فَبِئۡسَ ٱلۡمَصِيرُ

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? రహస్య సమాలోచనల్ని నిషేధించటం జరిగినప్పటికీ! వారు - నిషేధింపబడిన దానినే - మళ్ళీ చేస్తున్నారని? మరియు వారు రహస్యంగా పాపం చేయడం - హద్దులు మీరి ప్రవర్తించడం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించడం గురించి - సమాలోచనలు చేస్తున్నారని![1] (ఓ ముహమ్మద్!) నీ వద్దకు వచ్చినపుడు, అల్లాహ్ కూడా నీకు సలాం చేయని విధంగా, వారు నీకు సలాం చేస్తూ, తమలో తాము ఇలా అనుకుంటారు:[2] "మేము పలికే మాటలకు, అల్లాహ్ మమ్మల్ని ఎందుకు శిక్షించటం లేదు?" వారికి నరకమే చాలు, వారందులో ప్రవేశిస్తారు. ఎంత ఘోరమైన గమ్యస్థానం!

సూరా సూరా ముజాదిలా ఆయత 8 తఫ్సీర్


[1] ఈ ఆయత్ మదీనా యొక్క యూదులను మరియు కపటవిశ్వాసులను గురించి పలుకుతుంది. వారు ఉన్నచోట నుండి ముస్లింలు పోతూ ఉంటే, వారు గుసగుసలాడే వారు, దానికి ముస్లింలు, వారు తమను గురించి ఏదైనా దురాలోచనలు చేస్తున్నారేమో! లేక ముస్లింల సైన్యం మీద ఏదైనా శత్రువుల సైన్యం దాడిచేసి వారికి నష్టం కలిగించేదేమో! అని భయపడేవారు, కావున దైవప్రవక్త ('స'అస) ఇట్టి గుసగుసలను నిషేధించారు. అయినా వారు కొంతకాలం తరువాత మళ్ళీ ప్రారంభించారు. ఆ సందర్భంలోనే ఈ ఆయత్ అవతరింపబడింది. చూడండి, 4:114. [2] అల్లాహ్ (సు.తా.), మిమ్మల్ని పరస్పరం 'అస్సలాము అలైకుమ్ వ ర'హ్ మతుల్లాహ్', మీకు శాంతి కలుగుగాక! అని చెప్పుకోండి. అని ఆజ్ఞాపించాడు. కాని యూదులు దైవప్రవక్త ('స'అస)ను చూసినప్పుడు: 'అస్సాము అలైకుమ్' అంటే మీకు చావు వచ్చుగాక! అని అనేవారు. కావున దైవప్రవక్త ('స'అస) అలాంటి వారికి: 'వ అలైకుమ్.' అని జవాబు ఇవ్వండి, అని అన్నారు. అంటే మీరన్నదే మీకు! ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం).

సూరా ముజాదిలా అన్ని ఆయతలు

Sign up for Newsletter