కురాన్ - 60:11 సూరా సూరా ముమ్తహినా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِن فَاتَكُمۡ شَيۡءٞ مِّنۡ أَزۡوَٰجِكُمۡ إِلَى ٱلۡكُفَّارِ فَعَاقَبۡتُمۡ فَـَٔاتُواْ ٱلَّذِينَ ذَهَبَتۡ أَزۡوَٰجُهُم مِّثۡلَ مَآ أَنفَقُواْۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِيٓ أَنتُم بِهِۦ مُؤۡمِنُونَ

మరియు ఒకవేళ మీ (విశ్వాసుల) భార్యలలో ఒకామె, మిమ్మల్ని విడిచి సత్యతిరస్కారుల వద్దకు వెళ్ళిపోతే! (ఆ సత్యతిరస్కారులు, మీరు ఆ స్త్రీలకు చెల్లించిన మహ్ర్ మీకు వాపసు ఇవ్వడానికి నిరాకరిస్తే)! ఆ తరువాత మీకు వారితో ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికితే (మీరు వారిపై యుద్ధం చేసి విజయం పొందితే)[1]! దాని (విజయ ధనం) నుండి, ఎవరి భార్యలైతే సత్యతిరస్కారుల వద్దకు పోయారో వారికి - వారు (తమ భార్యలకు) ఇచ్చిన దానికి (మహ్ర్ కు) సమానంగా - చెల్లించండి. మరియు మీరు విశ్వసించిన అల్లాహ్ యందు, భయభక్తులు కలిగి ఉండండి.

సూరా సూరా ముమ్తహినా ఆయత 11 తఫ్సీర్


[1] 'ఆఖబ్ తుమ్ (దీని మరొక వ్యాఖ్యానం) : ప్రతీకారం తీసుకునే అవకాశం దొరికితే అంటే, ముష్రికుల భార్యలు కూడా ముస్లింలై, ముస్లింల దగ్గరికి వస్తే వారి - ఆ ముస్లిం అయిన స్త్రీల - మహ్ర్ వారి మొదటి ముష్రిక్ భర్తలకు చెల్లించక, దాని నుండి ఏ ముస్లింల భార్యలైతే ముష్రికులై వెళ్ళిపోయారో ఆ పురుషులకు చెల్లించాలి.

సూరా ముమ్తహినా అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13

Sign up for Newsletter