కురాన్ - 63:7 సూరా సూరా మునాఫిఖూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

هُمُ ٱلَّذِينَ يَقُولُونَ لَا تُنفِقُواْ عَلَىٰ مَنۡ عِندَ رَسُولِ ٱللَّهِ حَتَّىٰ يَنفَضُّواْۗ وَلِلَّهِ خَزَآئِنُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَلَٰكِنَّ ٱلۡمُنَٰفِقِينَ لَا يَفۡقَهُونَ

వారే (కపట విశ్వాసులే) ఇలా అంటూ ఉండేవారు: "అల్లాహ్ సందేశహరుని వద్దనున్న వారిపై మీరు ఖర్చు చేయకుండా ఉంటే! చివరకు వారే చెల్లాచెదురై పోతారు[1]." వాస్తవానికి ఆకాశాలలో మరియు భూమిలోనున్న సమస్త కోశాగారాలు అల్లాహ్ కే చెందినవి. కాని ఈ కపట విశ్వాసులు అది గ్రహించలేరు.

సూరా సూరా మునాఫిఖూన్ ఆయత 7 తఫ్సీర్


[1] దైవప్రవక్త ('స'అస) మదీనా రాకముందు 'అబ్దుల్లాహ్ బిన్ ఉబై మదీనావాసుల నాయకుడయ్యే సూచనలుంటాయి. దైవప్రవక్త ('స'అస) ప్రాబల్యం హెచ్చయి అతని ('స'అస) అనుచరు (ర'ది.'అన్హుమ్)ల సంఖ్య దినదినానికి పెరగటం చూసి, అతడు బాహ్యంగా ముస్లిం అయినా! అతని హృదయంలో దైవప్రవక్త ('స'అస) మరియు ముస్లింల పట్ల ద్వేషం ఉంటుంది. కావున అతడు వారిని ఎత్తిపొడవటానికి ఏ అవకాశం దొరికినా వదిలేవాడు కాదు. బనీ ము'స్'తలిఖ్ 'గజ్ వ నుండి తిరిగి వస్తున్నప్పుడు ఒక అన్సారి మరియు ఒక ముహాజిర్ (ర'ది.'అన్హుమ్)ల మధ్య చిన్న కలహం చెలరేగుతుంది. వారిద్దరు తమ తమ తెగలవారిని పిలుచుకుంటారు. అప్పుడు సమయం చూసి 'అబ్దుల్లాహ్ బిన్ ఉబై అన్సారులతో: 'చూశారా! మీదే తిని ఇప్పుడు మీ మీదికే వస్తున్నారు, ఈ ముహాజిర్ లు! వీరికి పెట్టడం మానేస్తే, మదీనా విడచి పోతారు!' ఈ మాటలు 'జైద్ బిన్-అర్ ఖమ్ (ర'ది.'అ) దైవప్రవక్త ('స'అస)కు తెలుపుతారు. దైవప్రవక్త ('స'అస) విచారించగా, 'అబ్దుల్లాహ్ బిన్ ఉబై తాను అలా అనలేదని నిరాకరిస్తాడు. ఆ సందర్భంలో ఈ సూరహ్ అవతరింపజేయబడింది, ('స'హీ'హ్ బు'ఖారీ).

సూరా మునాఫిఖూన్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11

Sign up for Newsletter