కురాన్ - 28:25 సూరా సూరా కసస్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَجَآءَتۡهُ إِحۡدَىٰهُمَا تَمۡشِي عَلَى ٱسۡتِحۡيَآءٖ قَالَتۡ إِنَّ أَبِي يَدۡعُوكَ لِيَجۡزِيَكَ أَجۡرَ مَا سَقَيۡتَ لَنَاۚ فَلَمَّا جَآءَهُۥ وَقَصَّ عَلَيۡهِ ٱلۡقَصَصَ قَالَ لَا تَخَفۡۖ نَجَوۡتَ مِنَ ٱلۡقَوۡمِ ٱلظَّـٰلِمِينَ

తరువాత ఆ ఇద్దరిలో ఒకామె సిగ్గుపడుతూ మెల్లగా అతని వద్దకు వచ్చి ఇలా అన్నది: "వాస్తవానికి నా తండ్రి - నీవు మా కొరకు (మా పశువులకు) నీరు త్రాపించి నందుకు - ప్రతిఫలమివ్వటానికి, నిన్ను పిలుస్తున్నాడు."[1] అతను, అతని వద్దకు పోయి తన వృత్తాంతాన్ని వినిపించాడు. అప్పుడతను అన్నాడు: "నీవు ఏ మాత్రం భయపడకు. నీవు దుర్మార్గ ప్రజల నుండి విముక్తి పొందావు."

సూరా సూరా కసస్ ఆయత 25 తఫ్సీర్


[1] ఆ ఇద్దరు స్త్రీల తండ్రి పేరు ఖుర్ఆన్ పేర్కొనలేదు. ఇమామ్ షౌకాని మరియు ఇతర చాలామంది వ్యాఖ్యాతలు అతని పేరు షు'ఐబ్ ('అ.స.) అని అన్నారు. ఎందుకంటే అతను మద్ యన్ జాతి వారివైపునకే ప్రవక్తగా పంపబడి ఉండెను. కాని ఇబ్నె-కసీ'ర్ అభిప్రాయం వేరుంది. అతను అంటారు: 'షు'ఐబ్ ('అ.స.) మరియు మూసా ('అ.స.) కాలాలలో చాలా గడువు ఉంది. కాబట్టి ఇతను షు'ఐబ్ ('అ.స.) తెగకు చెందిన మరొక వ్యక్తి కావచ్చు.' అల్లాహు ఆలమ్.

సూరా కసస్ అన్ని ఆయతలు

Sign up for Newsletter