కురాన్ - 28:57 సూరా సూరా కసస్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَالُوٓاْ إِن نَّتَّبِعِ ٱلۡهُدَىٰ مَعَكَ نُتَخَطَّفۡ مِنۡ أَرۡضِنَآۚ أَوَلَمۡ نُمَكِّن لَّهُمۡ حَرَمًا ءَامِنٗا يُجۡبَىٰٓ إِلَيۡهِ ثَمَرَٰتُ كُلِّ شَيۡءٖ رِّزۡقٗا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ

వారు ఇలా అంటారు: "ఒకవేళ నీతో పాటు మేము కూడా ఈ మార్గదర్శకత్వాన్ని అవలంబిస్తే! మేము మా భూమి నుండియే పారద్రోలబడతాము."[1] ఏమీ? మేము వారిని శాంతికి నిలయమైన ఒక పవిత్ర స్థలం (మక్కా) లో స్థిరనివాసము నొసంగి వారికి మా తరఫు నుండి జీవనోపాధిగా అన్ని రకాల ఫలాలను సమకూర్చలేదా? కాని వాస్తవానికి వారిలో చాలా మందికి ఇది తెలియదు.[2]

సూరా సూరా కసస్ ఆయత 57 తఫ్సీర్


[1] దీనిని ఈ విధంగా బోధించారు: 1) ఆ కాలపు ఖురైషులు ఇస్లాం స్వీకరిస్తే, వారి తోటి వారు, వారిని మతద్రోహులుగా పరిగణించి వారిని, వారి నగరం మక్కా నుండి పారద్రోలుతారని భయపడ్డారు. 2) అదే విధంగా ఈ కాలంలో కూడా చాలామంది ఇది సత్యధర్మమని తెలిసి కూడా తమ బంధువుల నుండి మరియు తమ సమాజం నుండి విడదీయబడతామని భయపడి సత్యాన్ని అవలంబించరు. కాని రాబోయే పరలోక జీవితపు శాశ్వత సుఖాల ముందు ఈ జీవిత సుఖం అతి స్వల్పమైనదనే సత్యాన్ని వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది! [2] చూడండి, 14:35-41, 21:26, 29:67. 22. ఇబ్రాహీం ('అ.స.) మక్కా కొరకు చేసిన ప్రార్థన.

సూరా కసస్ అన్ని ఆయతలు

Sign up for Newsletter