ఆయనే తన ఆజ్ఞతో, దేవదూతల ద్వారా, దివ్యజ్ఞానాన్ని (రూహ్ ను) [1]తాను కోరిన, తన దాసులపై అవతరింపజేస్తాడు,[2] వారిని (ప్రజలను) ఇలా హెచ్చరించటానికి: "నిశ్చయంగా, నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! కావున మీరు నాయందే భయభక్తులు కలిగి ఉండండి!"
సూరా సూరా నహల్ ఆయత 2 తఫ్సీర్
[1] అర్ - రూ'హు: అంటే ఇక్కడ దివ్యజ్ఞానం (వ'హీ) అని అర్థం. చూడండి, 40:15, 42:52. అక్కడ కూడా రూ'హ్ అర్థం వ'హీ అని ఉంది. మూడు చోట్లలో ఖుర్ఆన్ లో రూ'హ్, జిబ్రీల్ ('అ.స.) అనే అర్థంతో కూడా వాడబడింది. 19:17, 97.4. వివరాలకు చూడండి, 19:17 వ్యాఖ్యానం 3. [2] తన సందేశాన్ని ఎవరిపై అవతరింపజేయాలో అల్లాహ్ (సు.తా.) కు బాగా తెలుసు. చూడండి, 6:124 మరియు 40:15.
సూరా సూరా నహల్ ఆయత 2 తఫ్సీర్